రైతన్నలకు తొలి పండగ ఏరువాక
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:25 AM
రైతులు ఏరువాక పౌర్ణమిని తొలి పండగగా భావించి వ్యవసా య పనులు చేపట్టడం సంతోషదాయకమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి అన్నారు.
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు శ్రీదేవి
గజపతినగరం, జూన్ 29(ఆంధ్రజ్యోతి): రైతులు ఏరువాక పౌర్ణమిని తొలి పండగగా భావించి వ్యవసా య పనులు చేపట్టడం సంతోషదాయకమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి అన్నారు. సోమవారం పాతశ్రీరంగరాజపురంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వ్యవసా య సంస్కృతిని పరిరక్షించడం అందరి బాధ్యత అన్నా రు. జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు మాట్లా డుతూ ఎల్‌నినో సమస్యకు ఏకైక పరిష్కారం నవ ధాన్యాల సాగు అని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బోర్లు, విద్యుత్ కూడా డీఆర్‌డీఏ ద్వారా ఈఎంఐ పద్ధతిలో రైతులకు అందిస్తామని చెప్పా రు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మక్కువ శ్రీదర్, ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాల రాజు, పీఏసీఎస్ చైర్మన్ లెంక బంగారునాయు డు, ఏడీఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.