Share News

హౌస్‌హోల్డ్‌ సర్వే లోపాలను సరిచేయాలి

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:07 AM

హౌస్‌హోల్డ్‌ సర్వేలో నమోదైన వివరాల్లో లోపాల ను సరిచేయాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశిం చారు.

హౌస్‌హోల్డ్‌ సర్వే లోపాలను సరిచేయాలి

విజయనగరం, కలెక్టరేట్‌, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యో తి): హౌస్‌హోల్డ్‌ సర్వేలో నమోదైన వివరాల్లో లోపాల ను సరిచేయాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశిం చారు. మంగళవారం రాత్రి స్థానిక కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన కా న్ఫెరెన్స్‌లో ఆయన మాట్లాడారు. 2011 జనాభా లెక్కల తో పోలిస్తే గత 15 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో వస తులు మెరుగుపడినప్పటికీ సర్వే లాగిన్‌లో పలు లోపాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో క్షేత్ర స్థాయి సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లాగిన్‌ లో పలు చోట్ల పాఠశాలలకు విద్యుత్‌ సరఫరా, బస్సు సదుపాయాలు, ఇళ్ల సంఖ్య తగ్గట్లుగా తప్పుగా నమో దు చేయడంపై ఆయా శాఖ అధికారులను మందలిం చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీఆర్వోలు, విలేజ్‌ సర్వేయర్లకు షోకాజ్‌ నోటీసులు, చార్జీ మెమోలు జారీ చేయాలని ఆయన ఆదేశించారు. మొత్తం 27 మండ లాలు, 4 పురపాలక పరిధిలో 6158 పోలిక, వ్యత్యాసా లు నమోదు కాగా, ఇప్పటివరకూ 2193 పరిష్కారమ య్యాయని తెలిపారు. అక్టోబరు 4 తేదీలోగా సర్వే సవరణలు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. జేసీ సేతుమాధవన్‌, డీఆర్వో సత్తిబాబు పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2026 | 12:07 AM