Share News

Eradication of Child Labour బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:27 AM

Eradication of Child Labour is Everyone's Responsibility బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత అని రెండో అదనపు జిల్లా న్యాయాధికారి ఎం.మాధురి అన్నారు. శుక్రవారం ప్రపంచ బాల కార్మికత వ్యతిరేక దినం పురస్కరించుకుని జిల్లా న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో పార్వతీపురం కోర్టు ఆవరణలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.

Eradication of Child Labour  బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత
మాట్లాడుతున్న రెండో అదనపు జిల్లా న్యాయాధికారి మాధురి

బెలగాం, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత అని రెండో అదనపు జిల్లా న్యాయాధికారి ఎం.మాధురి అన్నారు. శుక్రవారం ప్రపంచ బాల కార్మికత వ్యతిరేక దినం పురస్కరించుకుని జిల్లా న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో పార్వతీపురం కోర్టు ఆవరణలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ... బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలన్నారు. చదువుకోవాల్సిన వయసులో వారితో ఉపాధి కోసం కఠినమైన పనులు చేయించడం నేరమని తెలిపారు. గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 కోట్ల మంది బాల కార్మికులుగా ఉన్నారన్నారు. 14 ఏళ్లలోపు పిల్లలను ఎక్కడైనా పనిలో పెట్టుకుంటే బాల కార్మిక చట్టం 1986 ప్రకారం నేరమని వెల్లడించారు. చట్టాన్ని ఉల్లంఘించిన యజమానులకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశముందన్నారు. ఈ సదస్సులో అడిషనల్‌ సివిల్‌ న్యాయాధికారి జె.సౌమ్యాజోస్ఫిన్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ పి.సువర్ణ, జిల్లా బాలల సంరక్షణాధికారి సత్యనారాయణ తదితరులున్నారు.

Updated Date - Jun 13 , 2026 | 12:27 AM