పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
ABN , Publish Date - May 17 , 2026 | 12:22 AM
స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రతోనే సాధ్య మవుతుందని ఎమ్మెల్యే కిమిడి కళావెంకట రావు అన్నారు.
చీపురుపల్లి, మే 16 (ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రతోనే సాధ్య మవుతుందని ఎమ్మెల్యే కిమిడి కళావెంకట రావు అన్నారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రలో భాగంగా శనివారం చీపురుపల్లి పంచాయతీ కార్యాలయ ఆవర ణలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరి సరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యతను ప్రతిఒ క్కరూ తీసుకోవాలన్నారు. టీడీపీ నాయకుడు దన్నాన రామచంద్రుడు, ఏఎంసీ చైర్మన్ రేగాన రామారావు, కెంబూరి సాయి, డీడీవో హేమసుందర్, ఎంపీడీవో సురేష్, తహసీల్దార్ డి.ధర్మరాజు పాల్గొన్నారు.
విజయనగరం రూరల్, మే 16(ఆంధ్రజ్యోతి): ద్వారపూడిలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు శనివారం స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. స్వచ్ఛ రథానికి పనికి రాని ప్లాస్టిక్, కాగితం, లోహం వస్తువులు అందజేసి.. వాటికి బదులుగా నిత్యావసర వస్తువులు పొందాని సూచించారు. ఎంపీడీవో గంటా వెంకటరావు పాల్గొన్నా రు.