సిరిమాను వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా..
ABN , Publish Date - Oct 26 , 2026 | 12:23 AM
పైడిమాంబ సిరిమానోత్సవం సందర్భంగా అమ్మవారి దర్శనార్థం వాహనాల్లో వచ్చే భక్తులు పార్కింగ్ చేసేందుకు వివిధ పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ దామోదర్ తెలిపారు.
రూట్ మ్యాప్ తయారీ
ట్రాఫిక్ నియంత్రణకు పక్కా ఏర్పాట్లు
ఎస్పీ దామోదర్
విజయనగరం దాసన్నపేట, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): పైడిమాంబ సిరిమానోత్సవం సందర్భంగా అమ్మవారి దర్శనార్థం వాహనాల్లో వచ్చే భక్తులు పార్కింగ్ చేసేందుకు వివిధ పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ దామోదర్ తెలిపారు. 26వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 27వ తేదీ రాత్రి 11 గంటల వరకూ వాహనాలు ఏ రూట్‌లో వెళ్లాలి.. ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఎక్కడ రాకపోకలు నిషేధించాలనే దానిపై ఎస్పీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఇలా వెళ్లాలి..
గజపతినగరం నుంచి రాజాపులోవ(విశాఖ వెళ్లే భారీ వాహనాలు) గొట్లాం వద్ద తప్పనిసరిగా బైపాస్ మీదుగా వెళ్లాలి. అలాగే రాజాపులోవ నుంచి వచ్చేభారీ వాహనాలు చెల్లూరు వద్ద బైపాస్ మీదుగా వెళ్లాలి..
నెల్లిమర్ల చీపురుపల్లి నుంచి వచ్చే భారీ వాహనాలు రాజీవ్‌నగర్ జంక్షన్ మీదుగా ఎడమ వైపు తీసుకుని నాతవలస వైపు వెళ్లాల్సి ఉంటుంది.
పార్కింగ్ స్థలాలివే..
విశాఖపట్టణం కోరుకొండ, జామి, అలమండ, కొత్తవలస పరిసర ప్రాంతాల నుంచి సిరిమాను వైపు వచ్చే వాహనాలు ఎత్తుబ్రిడ్జి మీదుగా మయూరి జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, అంబేడ్కర్ జంక్షన్, ధర్మపురి ఐస్‌ఫ్యాక్టరీ జంక్షన్ చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన కాశీరాజు సర్కస్ గ్రౌండ్, ఆయోధ్యామైదానం, ఎంఆర్ కళాశాల బాయ్స్ హాస్టల్ ప్రాంతాల్లో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
డెంకాడ, నాతవలస, శ్రీకాకుళం, భోగాపురం పరిసర ప్రాంతాల నుంచి సిరిమాను నిమిత్తంవచ్చే కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు రాజీవ్ నగర్ కాలనీ జంక్షన్, రైతు బజారు వెనుక రాజుల స్థలంలో వాహనాలు పార్కింగ్ చేయాలి. అలాగే దాసన్నపేట జంక్షన్ మీదుగా అయ్యన్నకోనేరు వద్ద ఏర్పాటుచేసిన పార్కింగ్ స్థలాల్లోనూ ఫోర్టుసిటీ స్కూల్, ఎస్‌వీఎన్ లేఅవుట్‌లో ఏర్పాటుచేసిన పార్కింగ్ స్థలాల్లో వాహనాలు ఆపాలి.
నెల్లిమర్ల, చీపురుపల్లి, గరివిడి, గుర్ల పరిసర ప్రాంతాల నుంచి వచ్చే సిరిమాను నిమిత్తం వాహనాలు కొత్తపేట, నీళ్లట్యాంకు జంక్షన్ మీదుగా కొత్తపేట మండపం, పాత బస్టాండ్, రాజీవ్ స్పోర్ట్సు స్టేడియం, ఇండోర్ స్టేడియంలో పార్కింగ్ చేయాలి.
గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, గంట్యాడ, ఎస్.కోట తదితర ప్రాంతాల నుంచివచ్చే వాహనాలు కలెక్టరేట్ నుంచి గూడ్‌షెడ్, సీఎంఆర్ జంక్షన్, సీఎంఆర్ మాల్స్ ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలాల్లో వాహనాలు పార్కింగ్ చేయాలి. అలాగే పీజీ స్టార్ ఆసుపత్రి పక్కన ఉన్న ఖాళీ స్థలం అలాగే ఎలక్ట్రీకల్ సబ్ స్టేషన్ వద్ద పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలపాలి.
వాహనాల రాకపోకలు నిషేధించిన ప్రాంతాలివే..
సిరిమాను సందర్భంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ అంబేడ్కర్ కూడలి నుంచి సింహాచలం మేడ జంక్షన్ వరకూ
అంబేడ్కర్ కూడలి నుంచి గంటస్తంభం వరకూ
ఎంఆర్ కళాశాల నుంచి గురజాడ సర్కిల్ వరకూ
కన్యకాపరమేశ్వరీ ఆలయం నుంచి గంటస్తంభం వరకూ
ట్యాక్సీస్టాండ్ నుంచి గంటస్తంభం వరకూ
సామ్రాట్ లాడ్జి నుంచి శివాలయం మీదుగా ఎంజీ రోడ్డు వరకూ
ఖమ్మవీధి జంక్షన్ నుంచి మూడు లాంతర్ల వరకూ
గుమ్చీ జంక్షన్ నుంచి కోట జంక్షన్ వరకూ
ఈ ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు వాహనాలు స్వాధీనం చేసుకుని, జరిమానా విధిస్తారని ప్రజలు గమనించాలని కోరారు.