Share News

ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చూడండి

ABN , Publish Date - Jan 19 , 2026 | 11:29 PM

శంబర జాతరకు వచ్చే భక్తులకు ఇటువంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఏఎస్పీ మనీషారెడ్డి పోలీసులను ఆదేశించారు.

ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చూడండి
వనంగుడివద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఏఎస్పీ మనీషారెడ్డి

-ఏఎస్పీ మనీషారెడ్డి

- శంబర జాతర ఏర్పాట్ల పరిశీలన

మక్కువరూరల్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): శంబర జాతరకు వచ్చే భక్తులకు ఇటువంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఏఎస్పీ మనీషారెడ్డి పోలీసులను ఆదేశించారు. శంబర జాతర ఏర్పాట్లను ఆమె సోమవారం పరిశీలించారు. ముందుగా గ్రామంలోని చదురు గుడిని సందర్శించి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, క్యూలైన్లను పరిశీలించారు. అనంతరం వనం గుడి పరిసర ప్రాంతాలతో పాటు శంబర హైస్కూల్‌ వద్ద వాహనాల పార్కింగ్‌ స్థలాన్ని, వనంగుడి వద్ద సాలూరు ప్రాంతం నుంచి వచ్చే ఇతర వాహనాలను నిలిపే పార్కింగ్‌ స్థలాలను పరిశీలించారు. జాతరకు వారం రోజులే గడువు ఉన్నందున డ్యూటీకీ హాజరయ్యే పోలీసులకు వసతి ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. ఏఎస్పీ వెంట సాలూరు సీఐ పి.రామకృష్ణ, మక్కువ పోలీసులు ఉన్నారు.

Updated Date - Jan 19 , 2026 | 11:29 PM