ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడండి
ABN , Publish Date - Oct 09 , 2026 | 12:06 AM
పైడిమాంబ సిరిమానోత్సవంలో భాగంగా సిరిమాను చెట్టు తరలింపుపై ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే అదితి గజపతిరాజు
విజయనగరం రూరల్, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): పైడిమాంబ సిరిమానోత్సవంలో భాగంగా సిరిమాను చెట్టు తరలింపుపై ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడు తూ, సిరిమాను చెట్టు తరలింపు సందర్భంగా కట్టుదిట్టంగా భద్రతా చర్యలు తీసుకో వాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. అధికారులు అంతా సమన్వయంతో చెట్టు తరలింపు పూర్తయ్యే వరకూ జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ తహసీల్దార్ శ్రీనివాసరావు, సీఐలు ఆర్‌వీఆర్‌కే చౌదరి, టి.శ్రీనివాసరావు, లక్ష్మణరావు, ఎస్.రాము పాల్గొన్నారు.