Share News

నామినేషన్ల ప్రక్రియలో అసౌకర్యం కలగకుండా దృష్టి సారించండి

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:20 AM

): పంచాయతీ ఎన్నికలకు సంబం ధించిన నామినేషన్ల ప్రక్రియలో అసౌకర్యం కలగకుండా ప్రత్యేక దృష్టి సారిం చాలని ఎంపీడీవో ఎన్‌.సూర్యనారాయణ, డిప్యూటీఎంపీడీవో ఎల్‌.గోపాలరావు సూచించారు.

 నామినేషన్ల ప్రక్రియలో  అసౌకర్యం కలగకుండా దృష్టి సారించండి
గరుగుబిల్లి: రావుపల్లి సచివాలయాన్ని పరిశీలిస్తున్న సూర్యనారాయణ :

గరుగుబిల్లి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలకు సంబం ధించిన నామినేషన్ల ప్రక్రియలో అసౌకర్యం కలగకుండా ప్రత్యేక దృష్టి సారిం చాలని ఎంపీడీవో ఎన్‌.సూర్యనారాయణ, డిప్యూటీఎంపీడీవో ఎల్‌.గోపాలరావు సూచించారు. ఆదివారం మండలంలోని ఏడుప్రాంతాల్లో పంచాయతీ సర్పంచ్‌, వార్డుమెంబర్ల కోసం నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గొట్టివలస,రావుపల్లి, గరుగుబిల్లి సచివాలయాల పరిధిలోని నామి నేషన్ల స్వీకరణపై సిబ్బందికి వారు పలు సూచనలు చేశారు. 25 పంచాయతీ లకుగాను ఈనెల 17వరకు నామినేషన్ల స్వీకరించనున్నట్లు తెలిపారు. నామి నేషన్లు వేసేందుకు వచ్చే వారికి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేప ట్టాలని కోరారు. పోలింగ్‌కేంద్రాల పరిధిలో అవాంఛనీయ సంఘటనలు నెల కొనకుండా ప్రత్యేక పోలీస్‌ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఎన్నికల నిబంధనలు పాటించాలి

సీతానగరం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నామినే షన్ల స్వీకరణ మొదటి రోజు ఆదివారం సర్పంచ్‌ పదవులకు ఎనిమిది, వార్డు మెంబర్ల పదవులకు నాలుగునామినేషన్లను రిటర్నింగ్‌అధికారుల వద్ద దాఖలు చేశారని ఎంపీడీవో ఎంఎల్‌ఎన్‌ ప్రసాద్‌, డిప్యూటీ ఎంపీడీవో కె.కుమారవర్మ తెలిపారు. ఈమేరకు మండలంలోని పెదభోగలి, బూర్జ, నిడగల్లులో నామినే షన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రసాద్‌ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్నికల నిబంధనలను పాటించాలని, నామినేషన్లు నిర్ధేశించిన గడువులోగా నిర్ధేశించిన నమూనాలతో పత్రాలను, కుల, ఆదాయ ధ్రువపత్రాలు నమూనాలకు పొందుపరచాలని కోరారు. నిర్ధేశించిన కేంద్రాల్లో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు సమర్పించాలని సూచించారు.

Updated Date - Nov 16 , 2026 | 12:20 AM