జగన్‌కు అవకాశం రాకుండా చూడండి
ABN , Publish Date - Jul 27 , 2026 | 12:41 AM
రానున్న ఎన్నికల్లో జగన్‌కు అవ కాశం రాకుండా చూడాలని చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కోరారు.
విజయనగరం రూరల్, జూలై 26 ( ఆంధ్రజ్యోతి): రానున్న ఎన్నికల్లో జగన్‌కు అవ కాశం రాకుండా చూడాలని చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కోరారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర రూపురేఖలే మారిపోతాయని తెలిపారు. ఆదివారం విజయనగరం నియోజకవర్గం టీడీపీ శ్రేణులతో ఆయన మా ట్లాడారు. రెండేళ్ల హయాంలో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు సీఎం చంద్రబాబు అహోరాత్రులు శ్రమిస్తున్నారన్నారు. 2019 నుంచి 2024 రాష్ట్రాని అధోగతి పాలుచేసిన జగన్మోహన్‌రెడ్డి మళ్లీ మేం అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారన్నారు. జగన్‌వస్తే రాష్ట్రం మళ్లీ తిరోగమనంలోకి వెళ్తుందన్నారు. నెల్లూరు టీడీపీ నాయకుడు కోటంరెట్టి గిరిధరరెడ్డి మాట్లాడుతూ భోగాపురం అంత ర్జాతీయ విమనాశ్రయం ప్రారంభోత్సవాన్ని ప్రతి కార్యకర్త, నాయకుడు ప్రతిష్టాత్మకం గా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో విజయనగరం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు పీవీజీ కుమార్, టీడీపీ నాయకులు గంటా పోలినాయుడు, గంటా రవి పాల్గొన్నారు. అనంతరం టీడీపీ నాయకులు పత్తిపాటి పుల్లారావు, కోటంరెడ్డి గిరిధరరెడ్డి, పీవీజీ కుమార్‌ను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అభినందించారు.