నిధులు వచ్చేలా చూడండి
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:16 AM
మండలంలోని భీమసింగి ఎస్‌వీజీసీ షుగర్ ఫ్యాక్టరీని రాష్ట్ర షుగర్‌కేన్ కమిషనర్ వి.వెంకట రావు శుక్రవారం సాయంత్రం సందర్శించారు.
రాష్ట్ర షుగర్‌కేన్ కమిషనర్ వెంకటరావును కోరిన
భీమసింగి ఫ్యాక్టరీ కార్మికులు
జామి, అక్టోబరు 23(ఆంధ్ర జ్యోతి): మండలంలోని భీమసింగి ఎస్‌వీజీసీ షుగర్ ఫ్యాక్టరీని రాష్ట్ర షుగర్‌కేన్ కమిషనర్ వి.వెంకట రావు శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఈసందర్భంగా ఫ్యాక్టరీ ఎండీ నాయుడు ఆయనకు కర్మాగారం పరిస్థితిని వివరించారు. ఫ్యాక్టరీలోని యం త్రాలను వెంకటరావు పరిశీలించి, ఇటీవల జరిగిన పరిణామాలను ఎండీని అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగులు ఆయన్ని కలిసి.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తమకు రూ.9కోట్లు విడుద ల చేసిందని, ఈ నిధులు వేగంగా వచ్చేలా చూడాలని కోరారు.