Share News

విత్తనాల పంపిణీలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

ABN , Publish Date - Jun 19 , 2026 | 12:12 AM

విత్తనాల పంపిణీలో రైతులకు ఇబ్బందులు లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సూచించారు.

విత్తనాల పంపిణీలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

  • ఎస్‌.కోట ఎమ్మెల్యే లలితకుమారి

వేపాడ, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): విత్తనాల పంపిణీలో రైతులకు ఇబ్బందులు లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సూచించారు. బల్లంకి గ్రామంలో గురువారం ఆమె రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ రైతులకు ఖరీఫ్‌ సాగుకు అవసరమయ్యే 8008 క్వింటాళ్ల వరి విత్తనాలను సమకూర్చామని తెలిపారు. ఏవో స్వాతి మాట్లాడుతూ ఈ విత్తనాలను కిలోకి రూ.10 చొప్పున బస్తాకి రూ.300లు సబ్సిడీతో పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొత్తవలస వ్యవసాయశాఖ ఏడీఏ భానులత, ఎస్‌.కోట, కొత్తవలస, లక్కవరపుకోట, మండల వ్యవసామాధికారులు, టీడీపీ మండల అధ్యక్షుడు గొంప వెంకటరావు, ఎంపీటీసీ తులసి తదితరులు పాల్గొన్నారు.

కోర్టు భవనాల నిర్మాణానికి కృషి చేస్తా..

కొత్తవలస, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): కొత్తవలస సివిల్‌ న్యాయాధికారి కోర్టు(జూనియర్‌) డివిజన్‌కు సంబంధించి నూతన భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు కోసం కృషి చేస్తానని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి గురువారం తెలిపారు. కొత్తవలస కోర్టు నూతన భవనాల నిర్మాణానికి సవరించిన ప్లాన్‌ ప్రకారం రూ.8కోట్ల 30లక్షల ఎస్టిమేషన్లతో హైకోర్టు రిజస్ట్రార్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శికి లేఖ వచ్చిందన్నారు. నూతన భవనాల నిర్మాణానికి పరిపాలనా సంబంధిత అనుమతుల మంజూరు కోసం చర్యలు తీసుకుంటానని ఆమె తెలిపారు. గత కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రిని కలిసినప్పుడు కొత్తవలస కోర్టుకు నిధులు మంజూరుతో పాటు, లక్కవరపుకోట మండలం రెల్లిగౌరమ్మపేటలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ మంజేరు చేయాలని కోరినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిని కలసి నిధులు మంజూరు కోసం కృషి చేస్తానని, ఈ సంవత్సరమే భవనాల నిర్మాణం మొదలయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని ఆమె చెప్పారు.

Updated Date - Jun 19 , 2026 | 12:12 AM