తాగునీటి సరఫరా పక్కాగా చేపట్టండి’
ABN , Publish Date - Oct 08 , 2026 | 12:30 AM
తాగునీటి సరఫరాలో ఎలాంటి అంత రాయం కలగకుండా చూడాలని సంబంఽధిత అధికారులను ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత ఆదేశించారు.
‘బొబ్బిలి రూరల్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): తాగునీటి సరఫరాలో ఎలాంటి అంత రాయం కలగకుండా చూడాలని సంబంఽధిత అధికారులను ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత ఆదేశించారు. బుధవారం కారాడ గ్రామంలోని సీపీడబ్ల్యూఎస్ స్కీమ్ సోర్స్‌తో పాటు కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నీటి సరఫరా వ్యవస్థ పనితీరు, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించిన తర్వాత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం బంకురువలసలో నిర్వహించిన జల్ అర్పణ్ దివస్‌లో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి కుళాయిల నుంచి రక్షిత తాగునీటిని అందిస్తున్నందుకు బంకురువలస గ్రామాన్ని హర్ ఘర్ జల్ గ్రామంగా అధికారికంగా ప్రకటిస్తూ డిక్లరేషన్ అందజేశారు. కార్యక్రమంలో డీఈఈ ఢిల్లేశ్వరరావు, ఎంపీడీవో రవికుమార్, డిప్యూటీ ఎంపీడీవో చంద్రమౌళీశ్వరరావు, ఏఈఈ విశ్వతేజ పాల్గొన్నారు.