Share News

Kharif Cultivation ఖరీఫ్‌ సాగుకు ఆటంకం లేకుండా..

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:26 AM

Ensure No Disruption to Kharif Cultivation రానున్న ఖరీఫ్‌కు సాగునీరు ఆటంకం లేకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు జంఝావతి ప్రాజెక్టు పరిధిలోని కాలువల్లో పూడికతీతల నిర్వహణకు సుమారు రూ.68 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

  Kharif Cultivation ఖరీఫ్‌ సాగుకు ఆటంకం లేకుండా..
కొత్తవలస సమీపంలో పిచ్చి మొక్కలతో నిండిన జంఝావతి ప్రధాన కాలువ

గరుగుబిల్లి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): రానున్న ఖరీఫ్‌కు సాగునీరు ఆటంకం లేకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు జంఝావతి ప్రాజెక్టు పరిధిలోని కాలువల్లో పూడికతీతల నిర్వహణకు సుమారు రూ.68 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాస్తవంగా ఈ ప్రాజెక్టు ద్వారా కొమరాడ, సీతానగరం, పార్వతీపురం, గరుగుబిల్లి మండలాల్లో సుమారు 25 వేల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. అయితే 9 వేల ఎకరాలకే నీరు అందుతుంది. దీంతో శివారు ప్రాంత రైతులు ఏటా వరుణుడిపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన కాలువల్లో అధికంగా గుర్రపు డెక్క పేరుకుపోయింది. పూడికతీతలు కూడా చేపట్టకపోవడంతో సాగునీరు సరఫరాకు ఆటంకం నెలకొంది. పలు ప్రాంతాల్లో కాలువలకు గండ్లు కూడా పడ్డాయి. ఈ నేపథ్యంలో రానున్న ఖరీఫ్‌కు రైతులకు ఇబ్బంది లేకుండా జంఝావతి కాలువల్లో గుర్రపు డెక్క, పూడికతీతలకు ప్రతిపాదనలు పంపించామని, నిధులు మంజూరవగానే పనులు చేపడతామని ప్రాజెక్టు ఏఈ పి.పవన్‌కుమార్‌ బుధవారం తెలిపారు.

Updated Date - Apr 09 , 2026 | 12:26 AM