Minimum Wages కనీస వేతనం ఇవ్వండి
ABN , Publish Date - Jul 31 , 2026 | 11:53 PM
Ensure Minimum Wages తమకు కనీస వేతనం ఇవ్వాలని స్కీం వర్కర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.
బెలగాం, జూలై31(ఆంధ్రజ్యోతి): తమకు కనీస వేతనం ఇవ్వాలని స్కీం వర్కర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ గేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఆశ, అంగన్‌వాడీ, సీహెచ్‌డబ్ల్యూ, మధ్యాహ్న భోజన, వీవోఏ, ఆర్‌పీ, స్కూల్, శానిటేషన్ కార్మికులకు రూ.26 వేలు కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. పీఎఫ్, ఈఎస్‌ఐ, పెన్షన్, బోనస్, గ్రాడ్యూటీ వంటి వాటిని అమలు చేయాలని, లేబర్ కోడ్లును రద్దు చేయాలని నినదించారు. ఈ క్రమంలో పోలీసులు సీఐటీయూ, స్కీం వర్కర్ల సంఘ నాయకులను అరెస్టు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత నాయకులను వదిలేయడంతో వారంతా వెనుదిరిగారు. ఈ నిరసనలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు డి.రమణారావు, ప్రధాన కార్యదర్శి మన్మఽథరావు, అంగన్‌వాడీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం.ఉమామహేశ్వరి , ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి శివాని , ఎండీఎం నాయకురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.