Share News

న్యాయం చేయండి

ABN , Publish Date - Jun 23 , 2026 | 12:23 AM

నమ్మించి భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకుని.. తర్వాత మోసం చేసిన పోలీస్‌ అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ నగరానికి చెందిన ఓ మహిళ కలెక్టరేట్‌ గేట్‌ ముందు సోమవారం నిరసనకు దిగారు.

 న్యాయం చేయండి

  • కలెక్టరేట్‌ ఎదుట మహిళ ధర్నా

విజయనగరం కంటోన్మెంట్‌, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): నమ్మించి భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకుని.. తర్వాత మోసం చేసిన పోలీస్‌ అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ నగరానికి చెందిన ఓ మహిళ కలెక్టరేట్‌ గేట్‌ ముందు సోమవారం నిరసనకు దిగారు. నగరంలో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న బొండా మురళీతో తనకు పరిచయం ఉందని, ఆమేరకు అతనిని నమ్మి మోసపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పూసపాటిరేగ మండలం, కుమిలి రెవెన్యూ పరిధిలో 29 సెంట్ల కొబ్బరితోటను ఆయన మీద నమ్మకంతో రిజిస్ట్రేషన్‌ చేశానని.. తదుపరి లావాదేవీల విషయంలో తనను నమ్మించి మోసం చేశారని ఆమె ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం తనకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్‌ గేట్‌ ముందు ఆమె బైఠాయించారు.

Updated Date - Jun 23 , 2026 | 12:24 AM