సర్ పకడ్బందీగా నిర్వహించండి: ఆర్డీవో
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:07 AM
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని చీపురుపల్లి ఆర్డీవో, ఎలక్ర్టోరల్ రిజిస్ర్టేషన్ ఆఫీసర్ ఎం. సుధారాణి కోరారు.
గరివిడి, జూలై 2(ఆంధ్రజ్యోతి): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని చీపురుపల్లి ఆర్డీవో, ఎలక్ర్టోరల్ రిజిస్ర్టేషన్ ఆఫీసర్ ఎం. సుధారాణి కోరారు.ఈనెల 14లోగా కార్యక్రమం పూర్తిచేయాలని ఆదేశించారు. గరివిడి పట్టణంలో గల 111, 112, 113, 115 పోలింగ్‌స్టేషన్ల పరిధిలో ఎస్‌ఐఆర్‌కి సంబం ధించి బీఎల్‌వోల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటిం టికి వెళ్లి త్వరితగతిన కార్యక్రమం పూర్తిచేయాలని కోరారు. సమగ్ర ఓటరు నమోదుకి సంబంధించి పలు అంశాలపై ఆమె బూత్‌లెవెల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ చింత బంగార్రాజు, ఎంపీడీవో ఎంవీబీ సుబ్రహ్మణ్యం, ఆర్‌ఐ అచ్యుతరావు, ఆర్డీవో కార్యాలయం పరిపాలనాధికారి సూర్యకాంతం పాల్గొన్నారు