Share News

Alliance Candidate కూటమి అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలి

ABN , Publish Date - Oct 18 , 2026 | 12:19 AM

Ensure a Landslide Victory for the Alliance Candidate కూటమి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత కూటమి నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కె.నాగబాబు అన్నారు. శనివారం పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో కూటమి నాయకులతో సమావేశమయ్యారు.

  Alliance Candidate  కూటమి అభ్యర్థిని అధిక  మెజార్టీతో గెలిపించాలి
సమావేశంలో ఎమ్మెల్సీ నాగబాబుతో కూటమి నేతలు

పాలకొండ, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): కూటమి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత కూటమి నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కె.నాగబాబు అన్నారు. శనివారం పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో కూటమి నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీ అభ్యర్థులు విజయఢంకా మోగించడం ఖాయం. ఐక్యతతో కూటమి నాయకులంతా పనిచేయాలి. చిన్నపాటి లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుని ముందుకు నడవాలి. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి. కూటమిలోని ప్రతి కార్యకర్తకు అధిష్ఠానం అండగా ఉంటుంది. ’ అని తెలిపారు. ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ.. సీట్ల సర్దుబాటులో కొంతమందికి ఇబ్బంది ఉన్నా .. భవిష్యత్‌లో వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పాలకొండ చైర్‌పర్సన్‌ సీటును జనసేనకు కేటాయించగా.. కూటమి నేతలతా సైనికుల్లా పనిచేసి విజయబావుటా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి, నాయకులు గంటా సంతోష్‌కుమార్‌, తేజోవతి, పల్లా విజయనిర్మల తదితరులున్నారు.

పాలకొండ చైర్‌పర్సన్‌ జనసేన అభ్యర్థిగా విజయ నిర్మల

పాలకొండ చైర్‌పర్సన్‌ జనసేన అభ్యర్థిగా పల్లా విజయ నిర్మలను ఖరారుచేస్తూ ఆ పార్టీ అధి ష్ఠానం శనివారం రాత్రి జాబితా విడుదల చేసింది. ఆమె 2014-2019 వరకు నగర పంచాయతీ చైర్‌ పర్సన్‌గా పనిచేశారు. నిర్మల భర్త కొండలరావు టీడీపీ సీనియర్‌ నాయకుడిగా ఉన్నారు. ఆమె ఆదివారం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరి నామినేషన్‌ వేయనున్నారు.

Updated Date - Oct 18 , 2026 | 12:19 AM