ప్రభుత్వ బడుల్లో చేర్పించండి
ABN , Publish Date - May 11 , 2026 | 12:28 AM
ప్రతిఒక్కరూ త మ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ కోరారు.
సంతకవిటి, మే 10(ఆంధ్రజ్యోతి): ప్రతిఒక్కరూ త మ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ కోరారు. మండల పరి ధిలోని మండవకురిటి జడ్పీ ఉన్నత పాఠశాల పరిధిలో ఆదివారం నిర్వహించిన బడి పిలుస్తోంది కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా హెచ్‌ఎం రమణమ్మ, ఉపాధ్యాయ సిబ్బంది ఆధ్వర్యంలో 12 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభు త్వం ప్రభుత్వ పాఠశాలలను సకల సౌకర్యాలతో అభి వృద్ధి చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తోం దన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొల్ల అప్పలనాయుడు, టీడీపీ మండల అధ్య క్షుడు గట్టి భాను, రాజాం నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షుడు వల్లూరు గణేష్, సంతకవిటి పీఏసీ ఎస్ చైర్మన్ చెలికాని మహేష్‌కుమార్, రాజాం ఏఎంసీ చైర్మన్ ప్రతినిధి గురవాన నారాయణరావు, టీడీపీ నా యకులు సమతం శ్రీను, కైలాస్, సాంబశివ పాల్గొన్నా రు.
రాజాం, మే 10(ఆంధ్రజ్యోతి): ప్రతిఒక్క పిల్ల్లవాడిని ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ కోరారు. రాజాం మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఆయన పర్యటించి, విద్యాశా ఖ అధికారులు, ఉపాధ్యాయులతో కలిసి ప్రచారం నిర్వహించారు.
గుర్ల, మే 10(ఆంధ్రజ్యోతి): ప్రభు త్వ బడల్లో చేర్పించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని తెట్టంగి జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కోరారు. ఆదివారం తెట్టంగి గ్రామంలో బడిపిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం చేశారు. ఈసందర్భంగా 15 మంది విద్యార్థుల ను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.