పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి
ABN , Publish Date - May 16 , 2026 | 12:25 AM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని నిర్వహించా లని బడిబాట రాష్ట్ర పరిశీలకుడు టి.నాగేశ్వర రావు సూచించారు.
గరుగుబిల్లి, మే 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని నిర్వహించా లని బడిబాట రాష్ట్ర పరిశీలకుడు టి.నాగేశ్వర రావు సూచించారు. శుక్రవారం మండలంలో నిర్వహి స్తున్న బడిబాట కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గరుగుబిల్లిలో ఆయన మాట్లాడుతూ గతంలో కంటే పాఠశాల విద్యను బలోపేతానికి ప్రభు త్వం దృష్టి సారించిందన్నారు. మెరుగైన వసతులు, బోధన వంటి సౌకర్యాలు కల్పన జరుగుతుందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా బోధన అందించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ మండలంలో 144 పిల్లలను ఒకటో తరగతిలో చేర్పించడంపై ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. ప్రైవేట్ పాఠశాలల్లో 68 మంది మాత్రమే చేరినట్టు సమాచారం ఉందని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కార్యక్రమంలో ఎంఈవో-1 కె.కొండలరావు, ప్రధానోపాధ్యాయులు ఎం.సింహాచలంనాయుడు, బి.శివకృష్ణ, సీఆర్‌ఎంటీ బోను రామకృష్ణ, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లు వి.శారద, బి.రమణమ్మ, తది తరులు పాల్గొన్నారు.