Boat to a Halt మొరాయించిన మోటారు.. నిలిచిన పడవ
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:27 PM
Engine Failure Brings Boat to a Halt కొట్టు-కొమరాడ గ్రామాల మధ్య నాగావళి నదిలో పడవ ప్రయాణానికి తరచూ ఇబ్బందులు ఎదురువుతున్నాయి. నాటు పడవకు ఏర్పాటు చేసిన మోటార్ మొరాయిస్తుండడమే ఇందుకు కారణం.
పూర్ణపాడు- లాబేసు వంతెన పూర్తి చేయాలని విన్నపం
కొమరాడ, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): కొట్టు-కొమరాడ గ్రామాల మధ్య నాగావళి నదిలో పడవ ప్రయాణానికి తరచూ ఇబ్బందులు ఎదురువుతున్నాయి. నాటు పడవకు ఏర్పాటు చేసిన మోటార్ మొరాయిస్తుండడమే ఇందుకు కారణం. దీంతో తొమ్మిది పంచాయతీ వాసులకు ఇక్కట్లు తప్పడం లేదు. బుధవారం కూడా మోటార్ మరమ్మతులకు గురైంది. కొమరాడ నుంచి బయ ల్దేరిన పడవ కొట్టు ఒడ్డు వద్ద నిలిచిపోయింది. దీంతో పలువురు గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు. నది మధ్యలో పడవ ఆగితే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కొట్టు నుంచి విద్యార్థులు, ప్రజలు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని.. నదిలో నడుంలోతు నీటిని దాటి కొమరాడ ఒడ్డుకు చేరారు. పూర్ణపాడు- లాబేసు వంతెన పూర్తయితే తమకీ కష్టాలు తప్పుతాయని వారు వాపోయారు. వంతెన పనులు పూర్తయ్యేలోపు పడవను మంజూరు చేయాలని నాగావళి ఆవల గ్రామస్థులు కోరుతున్నారు.