ఇంధన పొదుపు ప్రతి పౌరుడి బాధ్యత
ABN , Publish Date - May 16 , 2026 | 12:29 AM
ప్రపంచ వ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ వినియోగం అధికమవుతున్న నేపథ్యంలో ప్రతి పౌరుడు ఇంధన పొదు పును బాధ్యతగా గుర్తించాలని రవాణాశాఖ ఉప కమిషనర్ మణికుమార్ తెలి పారు.
రవాణా శాఖ ఉప కమిషనర్ మణికుమార్
విజయనగరం దాసన్నపేట, మే 15(ఆంధ్రజ్యోతి): ప్రపంచ వ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ వినియోగం అధికమవుతున్న నేపథ్యంలో ప్రతి పౌరుడు ఇంధన పొదు పును బాధ్యతగా గుర్తించాలని రవాణాశాఖ ఉప కమిషనర్ మణికుమార్ తెలి పారు. శుక్రవారం స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో ఇంధన కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు. అవసరం లేని ప్రయాణాలు తగ్గించుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వ్యక్తిగత వాహ నాలు వినియోగించాలని, డీజిల్, పెట్రోలు వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహ నాలు వినియోగించాలని, ఆర్టీసీ బస్సులు, రైళ్లను ఎక్కువగా వినియోగించాలని సూచించారు. సమావేశాలు, సమీక్షలు తదితర కార్యక్రమాలను సాధ్యమైనంత వరకూ జూమ్ ఆన్‌లైన్ వేదికల ద్వారా నిర్వహించుకోవాలన్నారు. ఇందనాన్ని ఆ దా చేసి దేశాభివృద్ధికి తోడ్పడదామన్నారు.