Encroachments on the tank must be removed. చెరువు ఆక్రమణలు తొలగించాలి
ABN , Publish Date - Jul 15 , 2026 | 12:05 AM
Encroachments on the tank must be removed. మున్సిపాలిటీ పరిధి డోలపేటలోని కొత్తచెరువు ఆక్రమణలకు గురైందని, చెరువు చుట్టూ కట్టిన గోడను తొలగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు చెరువు వద్ద మంగళవారం ధర్నాకు దిగారు. కొంతమంది వ్యక్తులు గోడకట్టి కోట్లాది రూపాయల విలువచేసే భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు.
చెరువు ఆక్రమణలు తొలగించాలి
డోలపేట గ్రామస్థుల ధర్నా
రాజాం రూరల్, జులై 14(ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీ పరిధి డోలపేటలోని కొత్తచెరువు ఆక్రమణలకు గురైందని, చెరువు చుట్టూ కట్టిన గోడను తొలగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు చెరువు వద్ద మంగళవారం ధర్నాకు దిగారు. కొంతమంది వ్యక్తులు గోడకట్టి కోట్లాది రూపాయల విలువచేసే భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 103లో 5.90 ఎకరాల చెరువు గర్భంలో 1976లో పట్టాలు ఇచ్చారని కొంతమంది వ్యక్తులు చెప్పడాన్ని వారంతా ఆక్షేపించారు. చెరువుగర్భంలో పట్టాలు ఎలా ఇచ్చారని, నేటికీ మీభూమి పోర్టల్‌లో చెరువుగానే కనిపిస్తోందని గ్రామస్థులు స్పష్టం చేశారు. చెరువుకు సంబంధించిన పత్రాలను విలేకరులకు చూపించారు. ఆక్రమణదారుల నుంచి చెరువును రక్షించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని డోలపేట గ్రామస్థులు హెచ్చరించారు.
ఆక్రమణదారులకు అధికారుల అండ
పాలవలస రాజగోపాల్, డోలపేట
ఆక్రమణదారులకు రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అండగా నిలుస్తోంది. అన్యాయం జరుగుతోందని ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తామని భయపెడుతున్నారు. స్టేంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా సేకరించిన వివరాల ప్రకారం చెరువు విస్తీర్ణం 12.8 ఎకరాలుగా నమోదై ఉంది. ఇందులో 4.4 ఎకరాలు చెరువుగా, 5.9 ఎకరాలు ఉమామహేశ్వర, లక్ష్మినారాయణస్వామి దేవస్థానంకి చెందినదిగా, 2.5 ఎకరాలు డి పట్టాగా నమోదై ఉంది. 1976లో పట్టాలు ఇచ్చామని కొంతమంది చెబుతున్నారు. చెరువులో పట్టాలు ఎలా ఇస్తారు.