పాత పద్ధతిలోనే ఉపాధి పనులను కొనసాగించాలి
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:32 AM
పాత పద్ధతిలోనే ఉపాధి పనులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తొత్తడి పైడిపునాయుడు డిమాండ్ చేశారు.
కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పైడిపునాయుడు
బొండపల్లి, జూలై 1(ఆంధ్రజ్యోతి): పాత పద్ధతిలోనే ఉపాధి పనులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తొత్తడి పైడిపునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఉపాధి కూలీలతో కలిసి గొల్లుపాలెం సచివాలయంలో కార్యదర్శికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతూ వీబీజీ రామ్‌జీ పేరుతో రాష్ట్రాలపై కేంద్రం భారాలను పెడుతూ క్రమంగా పథకాన్ని ఎత్తివేసే కుట్రలు చేస్తోందన్నారు. గతంలో కేంద్రం 90 శాతం నిధులు ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం నిధులు కేటాయించాల్సి ఉండేదన్నారు. కొత్త నిబంధన ప్రకారం కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు కేటా యించాల్సి ఉందని తెలిపారు. అలాగే పథకంలో 200 రోజులు పని దినాలను కల్పించాలని డిమాండ్ చేశా రు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈదుబిల్లి అప్పారావు, కూలీలు పాల్గొన్నారు.
కొత్త పథకాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా
లక్కవరపుకోట(కొత్తవలస), జూలై 1(ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా గురువారం నుంచి అమలు కానున్న వీబీజీ రాంజీ పథకానికి వ్యతిరేకంగా బుధవారం కొత్త వలస ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం విజయనగరం యూనిట్ ధర్నా నిర్వ హించింది. పాత పద్ధతిలోనే ఉపాధి పనులు నిర్వహిం చాలని డిమాండ్ చేసింది. గాడి అప్పారావు నేతృత్వం లో వ్యవసాయ, ఉపాధి కూలీలు భారీ సంఖ్యలో హాజరై కొత్త పథకానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 200 రోజులు పని కల్పించాలని, రూ.600లు కూలీ ఇవ్వాలని, పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు కల్పించా లని, వేసవి భృతి ఇవ్వాలని, ఉపాధి కార్మికుడు పని ప్రదేశంలో మరణిస్తే రూ.10లక్షల నష్టపరిహారం ఇవ్వా లని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు.