ఎయిర్‌పోర్ట్‌లో ఉపాధి కల్పించాలి
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:22 AM
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో జిల్లాకు చెందిన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు.
బొబ్బిలి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో జిల్లాకు చెందిన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. సోమవారం బొబ్బిలిలో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ 2,750 ఎకరాల్లో రూ.4,592 కోట్లు వెచ్చించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కార్గో టెర్మినల్‌తో సహా నిర్మిస్తున్న అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌పోర్టు జిల్లా అభివృద్ధికి గేమ్‌ఛేంజర్ కానుందని తెలిపారు. కార్యక్రమం లో అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ అసోసియేషన్ అధ్యక్షుడు మమ్ముల తిరుపతిరావు, మాతృభూమి సేవాసంఘం అధ్యక్షుడు ఇప్పలవలస గోపి, రైతు సంక్షేమసంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి లక్ష్మునాయుడు, స్ఫూర్తి సేవాసంఘం అధ్యక్షుడు సాయి, బీజేపీ జిల్లా కార్యదర్శి ముగడ అనిల్, పౌరవేదిక వర్కింగ్ అధ్యక్షుడు పిడకల ప్రభాకరరావు, ప్రధానకార్యదర్శి జలంత్రి రామచంద్రరాజు, కళాశాల అధినేత రౌతు వాసుదేవరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ బొంతు శ్రీరాములునాయుడు, జగదీశ్, బోర రమేష్ పాల్గొన్నారు.