Share News

ఉపాధి చట్టాన్ని యథావిధిగా అమలుచేయాలి

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:32 AM

పాత ఉపాధిహామీ చట్టాన్ని యథా విధిగా అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు సుబ్బరావమ్మ డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆరోపించారు.

 ఉపాధి చట్టాన్ని యథావిధిగా అమలుచేయాలి
జీ రామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలని నిరసన తెలుపుతున్న సుబ్బరావమ్మ

సాలూరు రూరల్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): పాత ఉపాధిహామీ చట్టాన్ని యథా విధిగా అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు సుబ్బరావమ్మ డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. సోమవారం తాడంగివలసలో ఉపాధి కూలీలతో మాట్లాడారు. జీ రామ్‌జీ చట్టాన్ని రద్దుచేయాలని కోరారు.దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కూలి పనుల్లేక ప్రజలు వలసలు పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఈవిషయంపై రాష్ట్రప్రభుత్వం ప్రశ్నించకపోవడం కూలీలకు అన్యాయం చేయడమేనన్నారు. ఆమెతోపాటు సీపీఎం నేతలు గంగునాయుడు, ఎన్‌వై నాయుడు, ఈశ్వరరావు,మర్రి శ్రీనివాసరావు ఉన్నారు.

Updated Date - Mar 17 , 2026 | 12:32 AM