Share News

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Sep 04 , 2026 | 12:23 AM

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి నాయ కులు కోరారు. ఈమేరకు గురువారం పార్వతీపురం కలెక్టరేట్‌, ఆర్డీవో తదితర ప్రభుత్వ కార్యాలయాలు వద్ద అమరాతి ఏపీ జేఏసీ సంఘ ఉద్యోగ సంఘాల నాయకులు మధ్యా హ్నం భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు.

  ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
పార్వతీపురం: ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న ఉద్యోగులు

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి నాయ కులు కోరారు. ఈమేరకు గురువారం పార్వతీపురం కలెక్టరేట్‌, ఆర్డీవో తదితర ప్రభుత్వ కార్యాలయాలు వద్ద అమరాతి ఏపీ జేఏసీ సంఘ ఉద్యోగ సంఘాల నాయకులు మధ్యా హ్నం భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు.

ఫపార్వతీపురం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల ఆకలికేకలను ప్రభుత్వం వినిపించుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్‌ జి.శ్రీరామ్మూర్తి కోరారు. పార్వతీపురం కలెక్టరేట్‌, ఆర్డీవో తదితర ప్రభుత్వ కార్యాలయాలు వద్ద అమరాతి ఏపీ జేఏసీ సంఘ ఉద్యోగ సంఘాల నాయకులు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు ఉద్యోగులు హాజరవుతున్నారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిఽధులు ఎం.శ్రీనివాసరావు, ఆర్‌వీ రమణ మూర్తి, విజయ్‌కుమార్‌, పీఏఎల్‌కుమార్‌, ఎం.మంజుష, ఎం.సునీత, కె.చంద్ర మౌళి, రాజేష్‌, పి.సునీత, అప్పలరాజు, ఎం.సూర్యనారాయణ, హేమలత పాల్గొన్నారు.

ఫపాలకొండ, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): న్యాయమైన సమస్యలు పరిష్కరించా లని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు కోరారు. పాలకొండ ఆర్డీవో కార్యాలయం ఎదుట తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వ ర్యంలో చేపడుతున్న ఉద్యమ కార్యచరణలో భాగంగా నిరసన తెలిపారు.

ఫభామిని, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి రెవెన్యూ ఉద్యోగులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎం.నాగేంద్ర ప్రసాద్‌, ఎంఆర్‌ఐ పి.మణి ప్రభాకర్‌, రాజేశ్వరరావు, డీటీ జె.రమేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 04 , 2026 | 12:23 AM