Share News

అనారోగ్య కారణాలతో ఉద్యోగిని ఆత్మహత్య

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:37 AM

అనారోగ్య కారణాలతో సచివాలయం ఉద్యోగిని ఆత్మహత్మ చేసు కున్న ఘటన కురుపాం మండలం గుజ్జువాయిలో మంగళవారం చోటు చేసుకుంది.

అనారోగ్య కారణాలతో ఉద్యోగిని ఆత్మహత్య

కురుపాం రూరల్‌/ గుమ్మలక్ష్మీపురం, జూలై 7 (ఆంధ్రజ్యోతి): అనారోగ్య కారణాలతో సచివాలయం ఉద్యోగిని ఆత్మహత్మ చేసు కున్న ఘటన కురుపాం మండలం గుజ్జువాయిలో మంగళవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గుజ్జువాయి గ్రామానికి చెందిన కొండగొర్రి శైలజ గుమ్మలక్ష్మీపు రం మండలం ఇరిడి సచివాలయంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమె ప్రసూతి సెలవులు నిమిత్తం తన కన్నవారి ఇంట గుజ్జువా యిలో కొన్ని నెలలుగా ఉంటున్నారు. ఆమెకు మూడు నెలల చిన్నారి ఉంది. కొంత కాలంగా శైలజకు మతి స్థిమితం లేనట్టు తెలుస్తోంది. మంగళవారం ఉద యం తన ఇంట్లోని ఫినాయిల్‌ను శైలజ తాగింది. విషయం తెలుసుకున్న కుటుం బ సభ్యులు సమీపంలోని మొండెంఖల్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటి కే శైలజ మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి భర్త మధు కూడా సచివాలయం ఉద్యోగిగా ఉన్నారు. ఈ ఘటనతో మృతురాలి స్వగ్రామం గుజ్జువాయి, అత్తవారి గ్రామం లక్కగూడలో విషాదం అలుముకుంది. ఈ ఘటనపై నీలకంఠాపురం ఎస్‌ఐ నీలకంఠరావు కేసు నమోదు చేశారు.

Updated Date - Jul 08 , 2026 | 12:37 AM