ఫిబ్రవరి 23 నుంచి ఎల్లారమ్మ జాతర
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:32 AM
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు జామి ఎల్లారమ్మ పండుగ ముహూర్తం చాటింపు కార్యక్రమం రసాభాసగా మారింది.
దేవదాయ శాఖ నిర్వహిస్తుందని ప్రకటించిన ఈవో
జామి, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఇలవేల్పు జామి ఎల్లారమ్మ పండుగ ముహూర్తం చాటింపు కార్యక్రమం రసాభాసగా మారింది. ఆదివారం ఉదయం ఆలయ ఈవో ప్రసాద్, మూడు కోవెళ్ల ప్రధా న పూజారి విశ్వనాథశర్మ ఆధ్వర్యంలో పండుగను ఫిబ్ర వరి 23, 24, 25 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం గ్రామ పురోహితులు ముహూర్తం పత్రాన్ని గ్రామపెద్దలకు అందజేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో న్యాయవాది అల్లు సత్యాజీ, ఉప సర్పంచ్ పద్మ వర్గం ఈవోతో మాట్లాడుతూ తమకు కోర్టు ఆర్డర్ ఉందని, తామే పండుగ నిర్వహిస్తామని తెలిపారు. ఇదే సమయంలో టీడీపీ మండల అధ్యక్షుడు వర్రి రమ ణ తదితరులు మాట్లాడుతూ దేవదాయశాఖ కమిషన ర్ ఈ ఆలయానికి సేవా కమిటీ వేశారని వారి ఆధ్వ ర్యంలో నిర్వహిస్తామని చెప్పడంతో వైసీపీ వర్గం వ్యతి రేకించింది. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరి గింది. తామే చేసి చూపిస్తామని సేవా కమిటీ చైర్మన్ అల్లాడ పెద్ద, పాలకమండలి డైరెక్టర్లు ప్రకటించారు. ఎ వరికి వారు గొడవ పడటంతో ఉద్రిక్తత నెలకొంది. కొం దరు బాహాబాహీకి దిగారు. దీంతో ఎస్‌ఐ వైవీ జనార్దన్ ఆధ్వర్యంలో సిబ్బంది వచ్చి ఒక వర్గాన్ని గుడిలో ఉంచి.. మరో వర్గాన్ని బయటకు పంపారు. గుడి బయట వైసీ పీ శ్రేణుల హడావుడి తగ్గకపోవడంతో పోలీసులు పహా రా నిర్వహించారు. చివరికి దేవదాయ శాఖ ఆధ్వర్యం లో పండుగ ఉంటుందని ఈవో ప్రసాద్ ప్రకటించారు.