Vote అర్హులకు ఓటు హక్కు కల్పించాలి
ABN , Publish Date - Aug 30 , 2026 | 12:14 AM
Eligible Citizens Must Be Granted the Right to Vote అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ ఓటరు జాబితాలో చోటు కల్పించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు.
బెలగాం, ఆగస్టు29(ఆంధ్రజ్యోతి): అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ ఓటరు జాబితాలో చోటు కల్పించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. 18 ఏళ్లు నిండిన యువతను ఓటర్లుగా నమోదు చేయడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఫారం-6, 8తో పాటు తొలగింపు దరఖాస్తులను త్వరగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఓటు హక్కుపై యువతకు అవగాహన కల్పించాలన్నారు. పేర్లు, తప్పులు, చిరునామా సవరణల్లో సాంకేతిక లోపాలు లేకుండా చూడాలన్నారు. పారదర్శకంగా జాబితాను రూపొందించాలన్నారు.
వంద రోజుల ప్రత్యేక కార్యచరణ
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడేలా వంద రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. మన్యం కళా వేదికలో ఆంగ్ల ఉపాధ్యాయులతో మాట్లాడుతూ.. విద్యార్థుల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని, ఉపాధ్యాయులు కూడా తమ భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆంగ్ల భాష ఉచ్ఛారణ మెరుగు పర్చాలని, ఏఐ వంటి ఆధునిక సాంకేతికను బోధనలో వినియోగించాలని ఆదేశించారు. క్రీడల్లో ప్రతిభ చూపిన ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో డీఈవో పి.బ్రహ్మాజీరావు, సమగ్ర శిక్ష ఏపీసీ బి.రాజ్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.