Elephants తోటపల్లిలో ఏనుగులు తోటపల్లిలో ఏనుగులు
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:26 AM
Elephants Spotted in Totapalli గత కొద్దిరోజులుగా కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో సంచరించిన ఏనుగులు గురుగుబిల్లి మండలానికి చేరాయి. ఆదివారం నందివానివలస సమీపంలోని పరిసరాల్లో హల్‌చల్ చేశాయి.
గరుగుబిల్లి, మార్చి 8(ఆంధ్రజ్యోతి): గత కొద్దిరోజులుగా కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో సంచరించిన ఏనుగులు గురుగుబిల్లి మండలానికి చేరాయి. ఆదివారం నందివానివలస సమీపంలోని పరిసరాల్లో హల్‌చల్ చేశాయి. గ్రామ సమీపంలోని చెరువులో కొంత సమయం సేదదీరాయి. అనంతరం తోటపల్లి సమీపంలోని పంట పొలాల్లో సంచరించాయి. ఏనుగుల కారణంగా పొలాల్లో ఉన్న నువ్వుతో పాటు తదితర పంటల ధ్వంసమవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే వాటిని ఈ ప్రాంతం నుంచి తరలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా నందివానివలస, తోటపల్లితో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఒంటరిగా ఎవరూ బయటకు రాకూడదని, కవ్వింపు చర్యలకు పాల్పడరాదని సూచిస్తున్నారు.