Share News

మళ్లీ ఏనుగుల సంచారం

ABN , Publish Date - Oct 19 , 2026 | 11:47 PM

సూరంపేట గ్రామ రెవెన్యూ పరిధిలో సోమవారం మళ్లీ ఏనుగుల సంచారం మొదలైంది.

మళ్లీ ఏనుగుల సంచారం
సూరంపేట సమీపంలోని తోటల్లో ఏనుగులు

సీతానగరం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): సూరంపేట గ్రామ రెవెన్యూ పరిధిలో సోమవారం మళ్లీ ఏనుగుల సంచారం మొదలైంది. పంటలు చేతికొచ్చే సమయంలో ఏనుగులు సంచారం మొదలుకావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం సూరంపేట పౌర సరఫరాల గిడ్డంగి సిబ్బంది గదిని ఏనుగులు ధ్వంసం చేశాయి. దాంతో ఏనుగులు మరింత నష్టం కలిగిస్తాయని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయంపై అటవీశాఖ అధికారి మణికంఠను వివరణ కోరగా ఏనుగుల వల్ల నష్టం జరగకుండా వాటిని అటవీ ప్రాంతంలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రైతులు రాత్రి వేళల్లో పశువులను బయట విడచిపెట్టవద్దన్నారు.

Updated Date - Oct 19 , 2026 | 11:48 PM