Elephants గజరాజుల హల్‌చల్
ABN , Publish Date - May 03 , 2026 | 11:41 PM
Elephants on the Move తోటపల్లి పంచాయతీ నందివానివలసలో ఆదివారం గజరాజులు హల్‌చల్ చేశాయి. దీంతో ఆ ప్రాంతవాసులు హడలిపోయారు. అవి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయో నని భయాందోళన చెందుతున్నారు.
గరుగుబిల్లి, మే3(ఆంధ్రజ్యోతి): తోటపల్లి పంచాయతీ నందివానివలసలో ఆదివారం గజరాజులు హల్‌చల్ చేశాయి. దీంతో ఆ ప్రాంతవాసులు హడలిపోయారు. అవి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయో నని భయాందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా గరుగుబిల్లి మండలంలోనే గజరాజులు సంచరిస్తూ.. స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రధానంగా తోటపల్లి, సుంకి, తదితర గ్రామాల్లో పంటలు, వ్యవసాయ సామగ్రి ధ్వంసం చేస్తున్నాయి. దీంతో రైతులు పొలాల వైపు వెళ్లలేకపోతున్నారు. తక్షణమే అటవీ శాఖాధికారులు స్పందించి ఈ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించే చర్యలు చేపట్టాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు.
నాలుగు నెలల తర్వాత తిరిగొచ్చాయ్..
భామిని, మే3(ఆంధ్రజ్యోతి): దాదాపు నాలుగు నెలల తర్వాత మళ్లీ ఒడిశా నుంచి మండలంలోకి ఏనుగులు ప్రవేశించాయి. ఆదివారం కీసర సమీపంలో దర్శనమిచ్చాయి. మొక్కజొన్న బస్తాలను చిందరవందర చేశాయి. ప్రస్తుతం ఏనుగులు తాలాడ ప్రాంతానికి సమీపంలోని ఐలమ్మతోటలో తిష్ఠవేశాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న పరిసర ప్రాంతవాసులు ఉలిక్కిపడ్డారు. ఘనసర, కీసర, కోసలి, తాలాడ గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు భయాందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కేశవతో పాటు ట్రాకర్స్ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.