Share News

ఏనుగుల స్వైరవిహారం

ABN , Publish Date - Jul 29 , 2026 | 12:27 AM

గరివిడి మండలంలో మంగళవారం ఏనుగులు సంచరించాయి.

ఏనుగుల స్వైరవిహారం

గరివిడి, జూలై 28(ఆంద్రజ్యోతి): గరివిడి మండలంలో మంగళవారం ఏనుగులు సంచరించాయి. వెదుళ్లవలస పంచాయతీలో దాట్ల నారాయణమూర్తిరాజుకు చెందిన చెరకు తోటలో ఏనుగులు సంచరించడంతో ప్రజలు వెళ్లి వాటిని చూశారు. అనంతరం ఈ ఏనుగులు మూడు ఎకరాల చెరకు తోటను ధ్వంసం చేశాయి. అనంతరం మెరక ముడిదాం మండలం వైపు కదిలాయి.

మెరకముడిదాం, జూలై 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని బిల్లవలస గ్రామంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏనుగులు సంచరించాయి. అక్కడ కొబ్బరితోటలో సేద తీరాయి. ఈ గుంపులో ఎనిమిది ఏనుగులు ఉన్నాయి.

పర్యవేక్షిస్తున్నాం..

ఏనుగుల సంచారంపై పార్వతీపురం రేంజర్‌ మణికంఠను వివరణ కోరగా.. ఏను గులు ఒడిశా సరిహద్దుల నుంచి బయటపడి కొన్నాళ్లుగా పార్వతీపురం, బొబ్బిలి మండలాల్లో సంచరించాయని, ఇప్పుడు అవి వాటి రూటు మార్చి తెర్లాం, మెరకము డిదాం మండలాల్లో ప్రవేశించాయని చెప్పారు. వీటి వెంట తమ సిబ్బంది ఉండి వాటి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారన్నారు. పార్వతీపురం, విజయనగరం ఫారెస్టు అధికారులు మూడు షిప్టులుగా ఏర్పడి వీటిని పర్యవేక్షిస్తున్నారని ఆయన చెప్పారు. కొద్ది రోజుల్లో అవి వెనక్కి అంటే పార్వతీపురం వైపు వస్తాయని చెప్పారు. అయితే వాటిని ప్రత్యేకంగా వెనక్కి పంపించలేమని, వాటంతట అవే వెనక్కి వచ్చేట ట్లు తమ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు.

Updated Date - Jul 29 , 2026 | 12:27 AM