తోటపల్లిలో గజరాజులు
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:10 PM
మండలంలోని తోటపల్లి పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఏనుగులు సంచరించాయి.
గరుగుబిల్లి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తోటపల్లి పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఏనుగులు సంచరించాయి. మొక్కజొన్న పంటను ధ్వంసం చేశాయి. గత కొన్నిరోజులుగా జియ్యమ్మవలస, కురుపాం, కొమరాడ మండలాల్లో 8 ఏనుగులు సంచరిస్తున్నాయి. నందివానివలస, గిజబ, తోటపల్లి, ఖడ్గవలస, సంతోషపురం, గౌరీపురం, గదబవలస గ్రామాల్లో పలు రకాల పంటలను ధ్వంసం చేస్తున్నాయి. చేతికి అందివచ్చిన మొక్కజొన్న, అరటి పంటలను ధ్వంసం చేస్తుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు దృష్టి సారించి నష్టం వాటిల్లిన పంటలకు పరిహారంతో పాటు ఏనుగుల గుంపును సురక్షిత ప్రాంతానికి తరలించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.