సూడిగాంలో ఏనుగులు
ABN , Publish Date - Oct 25 , 2026 | 12:10 AM
మండలంలోని సూడిగాం గ్రామంలో ఏనుగులు సంచరిస్తున్నాయి.
పార్వతీపురం రూరల్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సూడిగాం గ్రామంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. కొద్దిరోజులుగా మక్కువ మండలంలో సంచరించిన ఏనుగులు శనివారం పార్వతీపురం మండలానికి చేరుకున్నాయి. ముందుగా బండపల్లి సమీపంలోకి వచ్చిన ఏనుగులు సాయంత్రానికి సూడిగాం గ్రామ సమీపంలో సంచరిస్తున్నాయి. అటువైపు ప్రజలు వెళ్లవద్దని అటవీ శాఖాధికారులు హెచ్చరికలు జారీ చేశారు.