Share News

గిజబలో ఏనుగులు

ABN , Publish Date - Mar 17 , 2026 | 10:57 PM

మండలంలో ఏనుగుల బెడద తప్పడం లేదు.

గిజబలో  ఏనుగులు
గిజబ సమీపంలో అరటి పంటను ధ్వంసం చేస్తున్న ఏనుగులు

- పంటలు ధ్వంసం

గరుగుబిల్లి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఏనుగుల బెడద తప్పడం లేదు. కొద్ది రోజుల కిందట మండలానికి చేరిన ఎని మిది ఏనుగులు తోటపల్లి, నందివానివలస, గదబవలస, గౌరీపురం, పిట్టలమెట్ట, గిజబ, సుంకి గ్రామాల్లో సంచరిస్తున్నాయి. సోమవా రం సుంకిలో సంచరించిన ఏనుగులు మంగళ వారం నందవానివలస మీదుగా గిజబకు చేరుకున్నాయి. అరటి, పామాయిల్‌, మొక్కజొ న్న తదితర పంటలను ధ్వంసం చేశాయి. దీం తో రైతులు లబోదిబో మంటున్నారు. ఏనుగుల కారణంగా తాము ఆర్థికంగా నష్టపోతున్నా అధికారులు మాత్రం ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఏనుగులను అటవీ ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు.

Updated Date - Mar 17 , 2026 | 10:57 PM