గుమడలో ఏనుగుల తిష్ఠ
ABN , Publish Date - Aug 29 , 2026 | 11:12 PM
గుమడ గ్రామ పరిసరాల్లో ఏనుగులు తిష్ఠ వేశాయి. రెండు రోజులుగా ఇదే గ్రామంలో గజరాజులు ఉండడంతో రైతులు, గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
కొమరాడ, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): గుమడ గ్రామ పరిసరాల్లో ఏనుగులు తిష్ఠ వేశాయి. రెండు రోజులుగా ఇదే గ్రామంలో గజరాజులు ఉండడంతో రైతులు, గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. శనివారం పత్తి, పామాయిల్, వరి పంట పొలాల్లో సంచరించాయి. తక్షణమే ఈ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గ్రామ స్థులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ రేంజర్ మణికం ఠన్ తెలిపారు.
లోహరజోలకు చేరిన గుంపు
భామిని, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పక్కుడిభద్ర, బొమ్మిక ప్రాంతాల్లో వారం రోజులుగా సంచ రిస్తున్న నాలుగు ఏనుగుల గుంపు శని వారం రాత్రి లోహరజోలకు చేరింది. వడ్డంగిలో శుక్రవారం రాత్రి జరిగిన పెళ్లి ఊరేగింపులో బాణసంచా, డీజే శబ్దాల కారణంగానే ఏనుగులు లోహరజోల వైపు వచ్చినట్టు గ్రామస్థులు భావిస్తున్నారు.