Share News

Elephants అర్తాం కొండల్లో ఏనుగులు

ABN , Publish Date - Feb 15 , 2026 | 12:23 AM

Elephants in the Artham Hills కొమరాడ మండలంలో కొద్దిరోజులుగా సంచరిస్తున్న ఏనుగులు శనివారం సాయంత్రం అర్తాం కొండల్లో దర్శనమిచ్చాయి. దీంతో స్థానికులు బెంబేలెత్తి పోతున్నారు.

Elephants  అర్తాం కొండల్లో ఏనుగులు
అర్తాం కొండల్లో సంచరిస్తున్న ఏనుగులు

కొమరాడ, ఫిబ్రవరి14(ఆంధ్రజ్యోతి): కొమరాడ మండలంలో కొద్దిరోజులుగా సంచరిస్తున్న ఏనుగులు శనివారం సాయంత్రం అర్తాం కొండల్లో దర్శనమిచ్చాయి. దీంతో స్థానికులు బెంబేలెత్తి పోతున్నారు. పగలంతా కొండల్లో ఉంటున్న గజరాజులు రాత్రి వేళల్లో పొలాల్లో సంచరిస్తూ పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఇప్పటికే మండలంలో మొక్కజొన్న, అరటి పంటలను అవి నాశనం చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఏనుగుల కారణంగా గత రెండేళ్లుగా పంటలను నష్టపోతున్నా.. పరిహారం చెల్లించడం లేదని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసుంటే ఏనుగుల రూపంలో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. అటవీశాఖాధికారులు స్పందించి.. తక్షణమే ఈ ప్రాంతం నుంచి గజరాజులను తరలించే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Feb 15 , 2026 | 12:23 AM