Elephants నేరడిలో గజరాజులు
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:44 PM
Elephants in Neredu భామిని మండలంలోని నేరడి సమీపంలో గజరాజులు హల్‌చల్ చేస్తున్నాయి. ఆదివారం సాయంత్రం వంశధార నదీతీరంలో అవి సంచరించడంతో స్థాని కులు బెంబేలెత్తిపోయారు.
భామిని, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): భామిని మండలంలోని నేరడి సమీపంలో గజరాజులు హల్‌చల్ చేస్తున్నాయి. ఆదివారం సాయంత్రం వంశధార నదీతీరంలో అవి సంచరించడంతో స్థాని కులు బెంబేలెత్తిపోయారు. వారం రోజుల కిందట పసుకుడి, వంశధార నది ఆవల ఒడిశాలోని గౌరి, పురిటిగూడ ప్రాంతంలో సంచరించిన నాలుగు ఏనుగులు మళ్లీ ఈ ప్రాంతానికి రావడంతో రైతులు దిగులు చెందుతున్నారు. నేరడి, బిల్లుమడ, సింగిడి, పసుకుడి గ్రామస్థులు పొలాలకు వెళ్లేందుకు సాహసించలేకపోతున్నారు. ఏనుగులు ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తక్షణమే ఈ ప్రాంతం నుంచి వాటిని తరలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా గజరాజుల సంచారంపై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కేశవరావు, ట్రాకర్స్ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఒంటరిగా బయట తిరగరాదని, ఏనుగులను కవ్వించరాదని సూచించారు.