Share News

Elephants బొడ్డగూడలో ఏనుగుల హల్‌చల్‌

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:34 PM

Elephants Create Panic in Boddaguda భామిని మండలాన్ని గజరాజులు వీడడం లేదు. గత 40 రోజులుగా నులకజోడు ప్రాంతంలో సంచరించిన నాలుగు ఏనుగులు కొత్తగూడ మీదుగా శనివారం రాత్రి బొడ్డగూడ ప్రాంతానికి చేరాయి. మొదటిసారి ఈ ప్రాంతానికి అవి రావడంతో ఆదివారం గ్రామస్థులు వాటిని చూసేందుకు ఎగబడ్డారు.

 Elephants  బొడ్డగూడలో ఏనుగుల హల్‌చల్‌
బొడ్డగూడ సమీపంలో సంచరిస్తున్న ఏనుగులు

భామిని, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): భామిని మండలాన్ని గజరాజులు వీడడం లేదు. గత 40 రోజులుగా నులకజోడు ప్రాంతంలో సంచరించిన నాలుగు ఏనుగులు కొత్తగూడ మీదుగా శనివారం రాత్రి బొడ్డగూడ ప్రాంతానికి చేరాయి. మొదటిసారి ఈ ప్రాంతానికి అవి రావడంతో ఆదివారం గ్రామస్థులు వాటిని చూసేందుకు ఎగబడ్డారు. అయితే ఏనుగుల వల్ల ఎటువంటి నష్టం జరుగుతుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. బొడ్డగూడ మీదుగా తివ్వకొండ శిఖర గ్రామాలు, ఒడిశా ప్రాంతంలో ఉన్న గిరిజనులు రాకపోకలకు సాహసించలేకపోతున్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రాంతంలో రాగులు, మొక్కజొనతో పాటు వరి పొలాలను గజరాజులు ధ్వంసం చేశాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖా బీట్‌ అధికారి జె.కేశవరావతో పాటు ట్రాకర్స్‌ ఏనుగుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు గిరిజన గ్రామ స్థులను అప్రమత్తం చేస్తున్నారు. ఒంటరిగా ఎవరూ బయటకు రాకూడదని , కవ్వింపు చర్యలకు పాల్పడరాదని సూచించారు.

Updated Date - Oct 04 , 2026 | 11:34 PM