Share News

ఎర్రసామంతవలసలో ఏనుగుల తిష్ఠ

ABN , Publish Date - Oct 08 , 2026 | 11:41 PM

మండలంలోని ఎర్రసామంతవలస, చిమిడివలస గ్రామాల పరిసరాల్లో గురువారం ఏనుగులు సంచరించాయి.

ఎర్రసామంతవలసలో ఏనుగుల తిష్ఠ
రోడ్డుపై సంచరిస్తున్న ఏనుగులు

మక్కువ. అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎర్రసామంతవలస, చిమిడివలస గ్రామాల పరిసరాల్లో గురువారం ఏనుగులు సంచరించాయి. ఎర్రసామంతవలసలో మొక్కజొన్న, వరి, పామాయిల్‌ పంటలను ధ్వంసం చేశాయి. రోడ్లపైకి గజరాజులు వచ్చేస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నష్టపోయిన పంటలకు అధికారులు పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. ఏనుగులు గ్రామాల్లో సంచరిస్తున్నందున కేర్‌ ట్రాకర్స్‌ను ఏర్పాటు చేశామని, ప్రజలెవరూ కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని మక్కువ ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి సింహాద్రి తెలిపారు.

Updated Date - Oct 08 , 2026 | 11:41 PM