Share News

Elephant బాబోయ్‌ ఏనుగులు

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:37 PM

Elephant Scare! గజరాజుల గుంపు ఆదివారం గురుగుబిల్లి మండలం నుంచి సీతానగరానికి చేరుకుంది. దళాయివలస సమీపంలోని కొండ ప్రాంతంలో తిష్ఠ వేసిన ఏనుగులు బురదవెంకటాపురం బీటీ రహదారి గుండా కృష్ణరాయపురానికి చేరాయి.

Elephant బాబోయ్‌ ఏనుగులు
సుమిత్రాపురం సమీప చెరువులో సేదతీరుతున్న గజరాజులు

గరుగుబిల్లి/సీతానగరం, జూలై12(ఆంధ్రజ్యోతి): గజరాజుల గుంపు ఆదివారం గురుగుబిల్లి మండలం నుంచి సీతానగరానికి చేరుకుంది. దళాయివలస సమీపంలోని కొండ ప్రాంతంలో తిష్ఠ వేసిన ఏనుగులు బురదవెంకటాపురం బీటీ రహదారి గుండా కృష్ణరాయపురానికి చేరాయి. దీంతో ఆ ప్రాంతవాసులు బెంబేలెత్తిపోతున్నారు. గజరాజులు ప్రధాన రహదారిపై హల్‌చల్‌ చేస్తుండడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అవి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయో తెలియని పరిస్థితి. దీంతో వాహనాలను నిలిపివేసి జాగ్రత్తగా పరిసరాలను పరిశీలించి రాకపోకలు సాగిస్తున్నారు. వరి నారుమళ్లు, ఎదలను కరిరాజులు పాడు చేసే అవకాశం ఉందని సుమిత్రాపురం, కృష్ణరాయపురం రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే ఈ ప్రాంతం నుంచి వాటిని తరలించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడరాదని అటవీశాఖ అధికారి మనోజ్‌ తెలిపారు. ఏనుగుల వల్ల ఎవరికీ ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, వాటి కదలికలను ట్రాకర్స్‌తో పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

Updated Date - Jul 12 , 2026 | 11:37 PM