Elephants గజరాజుల విధ్వంసం
ABN , Publish Date - Aug 04 , 2026 | 11:57 PM
Elephant Rampage పాలవలసలో సోమవారం రాత్రి నాలుగు ఏనుగులు విధ్వంసం సృష్టించాయి. గ్రామ శివారులోని జీడి తోటలో సంచరించి స్థానికులను హడలెత్తించాయి. అక్కడున్న మూడు రేకుల ఇళ్లు, ఒక కోళ్ల షెడ్‌ను కూల్చేశాయి. ఓ ఇంటి లోపల ఉన్న ధాన్యం, బియ్యం బిస్తాలను తొండంతో ఏనుగులు లాగడానికి ప్రయత్నించాయి. అయితే ఓ ఇంటిలో నిద్రిస్తున్న నిమ్మల లింగన్న అనే గిరిజనుడు వాటిని గమనించి.. అక్కడి నుంచి పరుగులు తీశాడు.
గిరిజనుడికి తప్పిన ప్రాణాపాయం
భయాందోళనలో గ్రామస్థులు
భామిని, ఆగస్టు4(ఆంధ్రజ్యోతి): పాలవలసలో సోమవారం రాత్రి నాలుగు ఏనుగులు విధ్వంసం సృష్టించాయి. గ్రామ శివారులోని జీడి తోటలో సంచరించి స్థానికులను హడలెత్తించాయి. అక్కడున్న మూడు రేకుల ఇళ్లు, ఒక కోళ్ల షెడ్‌ను కూల్చేశాయి. ఓ ఇంటి లోపల ఉన్న ధాన్యం, బియ్యం బిస్తాలను తొండంతో ఏనుగులు లాగడానికి ప్రయత్నించాయి. అయితే ఓ ఇంటిలో నిద్రిస్తున్న నిమ్మల లింగన్న అనే గిరిజనుడు వాటిని గమనించి.. అక్కడి నుంచి పరుగులు తీశాడు. దీంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మొత్తంగా ఈ ఘటనతో గ్రామస్థులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తోటలు, పొలాల్లోకి వెళ్లేందుకు సాహసించడం లేదు. మరోవైపు గజరాజులు ధ్వంసం చేసిన ఇళ్లు, కోళ్ల షెడ్డును రెవెన్యూ, అటవీశాఖ సిబ్బంది పరిశీలించారు. ఏనుగులు సంచారం నేపథ్యంలో జీడి తోటల్లోని ఏర్పాటు చేసుకున్న పాకల్లో ఎవరూ ఉండరాదని అటవీశాఖ సిబ్బంది సూచించారు. ఏదేమైనా ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించి నష్ట పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు.