Elephant జిల్లాకేంద్రానికి సమీపంలోనే.. ఏనుగుల సంచారం
ABN , Publish Date - Oct 26 , 2026 | 12:18 AM
Elephant Movement Near District Headquarters జిల్లాకేంద్రం పార్వతీపురానికి అతి సమీపంలోనే ఏనుగులు సంచరిస్తున్నాయి. ఆదివారం పెదబొండపల్లి- సూడిగాం ప్రధాన మార్గంలో అవి హల్‌చల్ చేయడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. ప్రయాణికులు, సమీప గ్రామాల ప్రజలు కూడా తీవ్ర ఆందోళన చెందారు.
పార్వతీపురం రూరల్, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రం పార్వతీపురానికి అతి సమీపంలోనే ఏనుగులు సంచరిస్తున్నాయి. ఆదివారం పెదబొండపల్లి- సూడిగాం ప్రధాన మార్గంలో అవి హల్‌చల్ చేయడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. ప్రయాణికులు, సమీప గ్రామాల ప్రజలు కూడా తీవ్ర ఆందోళన చెందారు. గత రెండు రోజులుగా ఈ ప్రాంతంలోనే గజరాజులు సంచరిస్తుండడంతో మరోవైపు అటవీశాఖాధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైతులు పొలాలకు వెళ్లరాదని, వాటిని రెచ్చగొట్టద్దని ఫారెస్ట్ అధికారులు గ్రామస్థులకు సూచిసు ్తన్నారు. ఏనుగులు జనావాసాల వైపు వెళ్లకుండా మరోవైపు ట్రాకర్లు కూడా పర్యవేక్షిస్తున్నారు. కాగా గతంలో పెదబొండపల్లిలో ఒక వృద్ధుడు ఏనుగుల దాడిలో మరణించాడు. ఈ నేపథ్యంలో గజరాజులను ఈ ప్రాంతం నుంచి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పంటలను నష్టపోయిన వారికి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.