Share News

Elephant Movement ఏనుగుల హల్‌చల్‌

ABN , Publish Date - Jan 04 , 2026 | 12:23 AM

Elephant Movement భామిని మండలం పసుకుడి వంశధార నదీతీరంలో సంచరిస్తున్న గజరాజులు శుక్రవారం రాత్రి బీభత్సం సృష్టించాయి. లివిరి-భామిని మధ్యలోని ఓ ఫార్మ్‌హౌస్‌లో ఫర్నీచర్‌, కిటికీ అద్దాలు, గదిలో ఉన్న మంచం, దుప్పట్లు చిందరవందర చేశాయి.

Elephant Movement ఏనుగుల హల్‌చల్‌
ఇసుకగూడ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగులు

భామిని, జనవరి3(ఆంధ్రజ్యోతి): భామిని మండలం పసుకుడి వంశధార నదీతీరంలో సంచరిస్తున్న గజరాజులు శుక్రవారం రాత్రి బీభత్సం సృష్టించాయి. లివిరి-భామిని మధ్యలోని ఓ ఫార్మ్‌హౌస్‌లో ఫర్నీచర్‌, కిటికీ అద్దాలు, గదిలో ఉన్న మంచం, దుప్పట్లు చిందరవందర చేశాయి. కొబ్బరి, పామాయిల్‌ చెట్లను నాశనం చేశాయి. ఇక శనివారం ఉదయానికి అవి ఇసుకగూడ, సన్నాయిగూడ, ప్రాంతానికి చేరుకున్నాయి. దీంతో ఆయా ప్రాంతవాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కాగా బీట్‌ ఆఫీసర్‌ దాలినాయుడు, ట్రాకర్స్‌ ప్రజలకు అప్రమత్తం చేస్తున్నారు. ఒంటరిగా బయటకు రావొద్దని, ఏనుగులను కవ్వించొద్దని సూచించారు.

Updated Date - Jan 04 , 2026 | 12:23 AM