Share News

కోట్లాది రూపాయలతో విద్యుత్‌ పనులు

ABN , Publish Date - May 21 , 2026 | 11:54 PM

గత రెండేళ్లుగా కోట్లాది రూపాయలతో విద్యుత్‌శాఖలో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నామని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు.

 కోట్లాది రూపాయలతో విద్యుత్‌ పనులు

  • ఎమ్మెల్యే అదితి గజపతిరాజు

విజయనగరం రింగురోడ్డు, మే 21(ఆంధ్రజ్యోతి): గత రెండేళ్లుగా కోట్లాది రూపాయలతో విద్యుత్‌శాఖలో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నామని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు. దాసన్నపేట, ప్రశాంతినగర్‌లో రూ.5కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11కేవీ సబ్‌ స్టేషన్‌ను ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల వేణుగోపాల పురం వద్ద రూ.200కోట్లతో శంకుస్థాపన చేసిన సబ్‌ స్టేషన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, గత ఏడాది సోనియానగర్‌లో సబ్‌స్టేషన్‌ ప్రారంభించామని చెప్పారు. 100 నూతన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, అలాగే నగ రంలోని వివిధ ప్రాంతాల్లో రూ.2కోట్ల 40లక్షలతో ఎనిమిది 11 కేవీ ఫీడర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే వీటి అగ్రహారం నుంచి దాసన్నపేట వరకూ రూ.2కోట్ల 20లక్షలతో 33 కేవీ హెచ్‌టీ విద్యుత్‌ లైన్‌ వంటి అనేక పనులు చేయడం ద్వారా ప్రజలకు కోత ల్లేని నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయగలుగుతున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఎం.లక్ష్మణరావు, ఈఈ త్రినాథరావు, కూటమి నాయ కులు రాజేష్‌వర్మ, ప్రసాదుల ప్రసాద్‌, గంటా రవి, అనురాధ బేగం పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2026 | 11:54 PM