ఎలక్ట్రికల్ స్కూటర్ దగ్ధం
ABN , Publish Date - Nov 25 , 2026 | 12:22 AM
పట్టణంలోని కొత్తవలస మెండివీధిలో మంగళవారం ఎలక్ట్రికల్ స్కూటర్ అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది.
పార్వతీపురం టౌన్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కొత్తవలస మెండివీధిలో మంగళవారం ఎలక్ట్రికల్ స్కూటర్ అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. స్కూటర్ యజమాని గెంబలి నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం స్కూటర్‌కు విద్యుత్ చార్జింగ్ పెట్టిన కొన్ని నిమిషాలకే చిన్న మంట వచ్చిందన్నారు. మంట పెద్దదై స్కూటర్ పూర్తిగా దగ్ధమైయ్యిందన్నారు.