పోలింగ్ కేంద్రంలో ఎలక్టోరల్ అబ్జర్వర్ తనిఖీ
ABN , Publish Date - Oct 01 , 2026 | 12:12 AM
బూసాయివలస పోలింగ్ కేంద్రాన్ని ఎలక్టోరల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ బుధవారం సాయంత్రం పరిశీలించారు.
రామభద్రపురం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): బూసాయివలస పోలింగ్ కేంద్రాన్ని ఎలక్టోరల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ఆరా తీశారు. బీఎల్‌వోలు తిరస్కరించిన దరఖాస్తులను కూడా ప్రత్యేకంగా పరిశీలించారు. ఆ దరఖాస్తులను తిరస్కరించడానికి సరైన కారణాలు బీఎల్‌వోలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రామ్మోహనరావు పాల్గొన్నారు.
‘