Elections పారదర్శకంగా ఎన్నికలు జరపాలి
ABN , Publish Date - Oct 22 , 2026 | 12:45 AM
Elections Must Be Conducted Transparently స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిర్వహించాలని సాధారణ పరిశీలకుడు చిన్నరాముడు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికలపై వచ్చే ఫిర్యాదులను తక్షణమే విచారించాలని, పోలింగ్ కేంద్రాల్లో లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
పార్వతీపురం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిర్వహించాలని సాధారణ పరిశీలకుడు చిన్నరాముడు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికలపై వచ్చే ఫిర్యాదులను తక్షణమే విచారించాలని, పోలింగ్ కేంద్రాల్లో లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా తొలుత జిల్లా వ్యయ పరిశీలకులు బబితకుమారి మాట్లాడుతూ.. బరిలో ఉన్న అభ్యర్థులు విధిగా నిబంధనలు పాటించాలన్నారు. మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ అభ్యర్థికి రూ.20 లక్షలు, వార్డు సభ్యులకు రూ.7.50 లక్షలు, నగర పంచాయతీలో చైర్‌పర్సన్ అభ్యర్థికి రూ.10 లక్షలు, వార్డు సభ్యులకు రూ.5 లక్షలుగా ఎన్నికల వ్యయ పరిమితులు ఉన్నాయని వెల్లడించారు. నామినేషన్ నుంచి ఫలితాల ప్రకటన వరకు రోజువారీ ఖర్చులను నమోదు చేయాలన్నారు. ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి మాట్లాడుతూ.. కులం, మతం, ఆధారంగా ఓట్లు అడగడం, ప్రార్థనా మందిరాలను ప్రచారానికి వినియోగించడం, అనుమతులు లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. మైక్‌లకు అనుమతి తీసుకోవాలని సూచించారు. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో కె.హేమలత, వ్యయ పరిశీలకుల బృందం తదితరులు పాల్గొన్నారు.