Share News

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

ABN , Publish Date - Sep 08 , 2026 | 11:58 PM

నగరపాలక సంస్థ ఎన్నికలు సమర్థవంతంగా, పాదర్శకంగా నిర్వహించాలని నగర కార్పొరేషన్‌ కమిషనర్‌ బాలాస్వామి ఎన్నికల అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

  • నగర కార్పొరేషన్‌ కమిషనర్‌ బాలాస్వామి

విజయనగరం టౌన్‌, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ ఎన్నికలు సమర్థవంతంగా, పాదర్శకంగా నిర్వహించాలని నగర కార్పొరేషన్‌ కమిషనర్‌ బాలాస్వామి ఎన్నికల అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మంగళవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎన్నికల విధివిధానాలపై ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి నాలుగు డివిజన్లకు ఒక ఎన్నికల అధికారిని నియ మించామని చెప్పారు. ఓటరు జాబితా, పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించాలన్నారు. మేయర్‌ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతుందని తెలిపారు. నగర పరిధిలో 2, 23, 050 మంది ఓటర్లు నమోదయ్యారన్నారు. ఎన్నికల సిబ్బంది బాధ్యతతో త్వరలో జరగబోయే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ సమావే శంలో సహాయక ప్రణాళిక అధికారి హరిబాబు, రమణమూర్తి, సర్వేయర్‌ సింహా చలం, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2026 | 11:58 PM